Monday, December 23, 2024

మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో సంచలనం రేపిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ప్రధాన నిందితుడు భాను కిరణ్ విడుదలయ్యారు. చంచల్‌గూడ జైలులోనే ఆయన సుమారు 12 ఏళ్ల పాటు ఉన్నాడు. సిఐడి ఆర్మ్ యాక్ట్ కేసులో భాను కిరణ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. జనవరి 4, 2011న మద్దెల చెరువు సూరి, భాను కిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎంఎల్‌ఎ పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి ప్రధాన నిందితుడు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో భానుకిరణ్ మద్దెల చెరువు సూరిని తుపాకీతో కాల్చి చంపేశాడు. అప్పట్లో ఈ మర్డర్ కేసు పెద్ద సంచలనం సృష్టించింది

. అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి, మొద్దు శీను, భాను కిరణ్‌ల పేర్లు ఓ రక్త చరిత్రను తలపిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. సూరీ హత్యకేసులో భాను కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం విచారణ చేపట్టి భాను కిరణ్‌కు శిక్షను విధించింది. తాను దాదాపుగా 12ఏళ్ల నుంచి శిక్షను అనుభవిస్తున్నానని భాన్ కిరణ్ బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం స్థానిక కోర్టులోనే ఈ కేసును పరిష్కరించుకోవాలని తెలి పింది. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. భాను కిరణ్ జీవిత ఖైదుపై విచారణ నవంబరు 11వ తేదీన కోర్టు ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News