Monday, December 23, 2024

బిజెపి మునుగోడులో మనీనే నమ్ముకుంది: భాను ప్రసాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఎంఎల్ సి భాను ప్రసాద్ మండిపడ్డారు. సోమవారం టిఆర్ఎస్ఎల్ పి కార్యాలయం నుంచి భాను ప్రసాద్ మాట్లాడారు. వ్యవస్థలను బిజెపి భ్రష్టు పట్టించిందని, నిన్న బిజెపి నేత దగ్గర కోటి రూపాయలు దొరికాయని, మునుగోడులో బిజెపి ప్రవహింపజేస్తున్న ధనానికి నిదర్శనమన్నారు. కేవలం డబ్బు పెట్టి ఉపఎన్నికలో గెలవాలని బిజెపి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు చైతన్య వంతులు కావడంతో బిజెపికి బుద్ధి చెబుతారన్నారు. బిజెపి జోకుడు గాళ్ళు, పెకుడు గాళ్ళు తుపాకీ రాముళ్ల మాటలకు ప్రజలు లొంగరని, మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని మేము ఎన్నో సార్లు ఎన్నికల కమిషన్ కు మొరపెట్టుకున్నామని, మా మాటను ఇసి పెడ చెవిన పెట్టడం దురదృష్టకరమన్నారు.

మళ్లీ ఇప్పుడు ఎవరి ఒత్తిడితో రోడు రోలర్ గుర్తుని కేటాయించారని ప్రశ్నించారు. బిజెపి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరుకు ఇసి తీరు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ఇసి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడాలని భాను ప్రసాద్ సవాలు విసిరారు. సికింద్రాబాద్ ఎంపిగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తీసుకరాలేదని, మునుగోడుకు ఎలా తీసుకవస్తారని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బిజెపి నేతల వద్ద సబ్జెక్ట్ లేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం ప్రతిష్టను మంట గలుపుతున్నారని భాను ప్రసాద్ మండిపడ్డారు. ఏమి మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదని, కర్ణాటక మహారాష్ట్రాలలో బిజెపి ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు తెలుసునని, తాను యుపి 150 కిలోమీటర్లు ప్రయాణించడానికి 6 గంటల సమయం పట్టిందని, తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? అని నిలదీశారు.

మునుగోడు ఉప ఎన్నికలలో గెలవడానికి బిజెపి డబ్బునే నమ్ముకుందని,  ప్రధాని మోడీ చివరకు నోట్ల రద్దును కూడా అభాసుపాలు చేశారని, వెయ్యి నోటు రద్దు చేసి 2 వేల నోటును తీసుకవచ్చారని, డబ్బు రవాణాను బిజెపి ప్రభుత్వం సులభ తరం చేసిందని భాను ప్రసాద్ మండిపడ్డారు. అమెరికాలాంటి దేశంలో నూరు డాలర్ల నోటే అతి పెద్దదని, భారత్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఈ డబ్బుల రవాణా సులభమయ్యేదన్నారు. బిజెపి గురించి ఆ పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన విమర్శలు ఒక సారి పరిశీలించాలన్నారు. ఎన్నికలపుడు నేతలు పార్టీ లు మారడం సహజమని, మా పార్టీలోకి కూడా నేతలు వస్తారని, ఎన్నికల కమిషన్ కారును పోలిన గుర్తుల విషయం లో ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News