Sunday, December 22, 2024

మద్దెల చెరువు సూరి హత్య కేసులో దోషి భానుకిరణ్ హైకోర్టులో పిటిషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన దోషి భాను కిరణ్ తనకు బెయిల్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో నాంపలి కోర్టు భానుకిరణ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో భాను కిరణ్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2011 సంవత్సరంలో మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన దోషిగా ఉన్నారు. 2018లోనే నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేయడంతో 11 సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నారు. తనకు బెయిల్ ఇప్పించాలని భాను హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో విచారణ జరిగిన అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News