Sunday, December 22, 2024

భన్వర్ సింగ్ షెకావత్ కు పుట్టినరోజు శభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

‘పుష్ప 2 ద రూల్’ సినిమా నుంచి భన్వర్ సింగ్ షెకావత్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ఫహద్ ఫాజిల్ చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. మంగళవారం ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప 2’ నుంచి ఫహద్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ మేకర్స్ బర్త్ డే విషెస్ ను తెలియజేశారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఫహద్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఈ చిత్రంలో ఫహద్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేశారు మేకర్స్. ‘ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోడానికి వస్తున్నాడు’ అంటూ ఫహద్ ఫాజిల్ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ‘పుష్ప ది రైజ్’ లో అల్లు అర్జున్‌, ఫహద్ మధ్య పోటాపోటీగా సాగే సీన్స్.. ‘పుష్ప-2 దిరూల్’పై అంచనాలు పెంచాయి.

సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News