సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు గుడ్ న్యూస్. మహేష్ నటించిన బ్యాక్ బస్టర్ మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. మహేష్-మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భరత్ అనే నేను’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మంగళవారం మేకర్స్ ప్రకటించారు. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు.
కాగా, 2018లో విడుదలైన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో మహేష్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమై మ్యూజిక్ అందించారు. ఇందులోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కాగా, ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.