హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 27న నిర్వహించనున్న భారత్ బంద్‌కు మద్దతు ఇస్తుంది. ఏఐఫ్‌ఈఈ (ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆప్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ )నిర్ణయాన్ని గౌరవిస్తూ విద్యుత్ సంస్థలలో లంచ్ అవర్ డిమానిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్‌ఎంప్లాయిస్ యూనియన్ 1104 అధ్యక్ష, కార్యదర్శులు ఎన్. పద్మారెడ్డి, జి. సాయిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రైతే రాజు అనే దేశంలో 10 నెలలుగా దేశరాజధాని శివారు ప్రాంతంలో రైతులు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదంటున్నారు. నూతన రైతు చట్టాలను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మిక చట్టాలను తీసుకురావాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని, విద్యుత్ సవరణలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి సర్కిల్స్‌కు సంబంధించి టిఎస్‌ఎస్‌పిడీసీఎల్ ఆఫీసు ముందు, విద్యుత్ సౌధ, అన్ని సబ్‌స్టేషన్ల లంచ్ విరామసమయంలో నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో విద్యుత్ సంస్థల్లో పని చేసే సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
భారత్ బంద్‌కు ఏఐఎఫ్‌ఈఈ
- Advertisement -
- Advertisement -
- Advertisement -