- Advertisement -
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. బీహార్,యూపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుండగా.. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకుల జూన్ 18వ (శనివారం) తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. బీహార్‌లోని ఆర్ ఏజిడి ఆధ్వర్యంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ బంద్‌కు మద్దతు ఇచ్చాయి. అగ్నిపథ్ పథకం రద్దుపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే దాకా ఆందోళన విరమించబోమని సైనిక ఉద్యోగ అభ్యర్థులు స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే సైనిక ఉద్యోగ నియామకాలు జరపాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -