Thursday, January 23, 2025

పన్ను చెల్లింపు ఇంకా ఈజీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ బిల్లులు చెల్లించడానికి మున్సిపల్ శాఖ భారత్ బిల్‌పే సిస్టం (బిబిపిఎస్) విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఆస్తి పన్ను చెల్లింపులు మరింత సులువు కావడంతో ఆన్‌లైన్‌లో సులువుగా బిల్లు కట్టేయ్యవచ్చని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కొంతకాలంగా ఆస్తి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నులను చెల్లించడానికి సులువైన విధానాలను పురపాలక శాఖ అమలు చేస్తోంది.

తాజాగా తెచ్చిన విధానంలో యజమానులు తమకు అనువైన విధానంలో పన్నులను చెల్లించుకునే వెసులుబాటు ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం, అమెజాన్ పే, మొబివిక్ తదితర వాటిల్లో బిల్‌పే ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై క్లిక్ చేస్తే మున్సిపల్ టాక్స్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే తెలంగాణ మున్సిపాలిటీస్ అనే ఆప్షన్ వస్తుంది. దానిలో అసెస్‌మెంట్ నెంబర్, మొబైల్ నెంబర్, యజమానుల వివరాలు స్క్రీన్‌పై కనబడుతాయి. దీంతో బిల్లు చెల్లించవచ్చు.
పన్ను చెల్లింపుల్లో గణనీయమైన మార్పులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న తరుణంలో ఆస్తి పన్ను సహా ఇతర పన్నులను వసూలు చేయడానికి యజమానులకు అనువైన, సులువైన విధానం ఉండటంతో అధిక శాతం చెల్లింపులు అవుతాయని, మున్సిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులకు వసూళ్లపై ఒత్తిడి తగ్గుతుందని పురపాలక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటి యజమానులకు బిల్లులు చెల్లించాలని ఉన్నా, ఆ ప్రక్రియకు సమయం వెచ్చించలేక చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నాయి. ఇలాంటి సమస్యలకు ఇబ్బందులు తలెత్తకుండా పురపాలక శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది.

గతంలో మున్సిపల్ పన్నులను మున్సిపల్ కార్యాలయాల్లో ఉండే పన్ను చెల్లింపు కేంద్రాల్లో మాత్రమే చెల్లించే అవకాశం ఉండేది. ఆ తర్వాత మీ సేవా కేంద్రాల్లో చెల్లించేలా మార్పులు చేశారు. రెండేళ్లలో పన్ను చెల్లింపులకు గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. గత సంవత్సరం నుంచి మున్సిపల్ బిల్లుపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఇస్తున్నారు. ఆ క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చెల్లించే వెసులుబాటును సైతం పురపాలక శాఖ అధికారులు కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News