Friday, November 22, 2024

40 దేశాలకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కొవాగ్జిన్ టీకాను నలభై దేశాలకు సరఫరా చేయనున్నట్టు ఆ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈమేరకు అధికారిక అనుమతులు కోసం దరఖాస్తు చేసినట్టు ఈ వారం ఆఖర్లో బ్రెజిల్, అరబ్ తదితర దేశాలకు మిలియన్ డోసులు పంపనున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని, అమెరికాలో తమ టీకా విక్రయాలకు అక్కడి ఫార్మా సంస్థ ఆక్యుజెన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించింది. ఈ టీకా భారత్‌లో వినియోగించడం సురక్షితమేనని భారత్‌లో ఔషధ నియంత్రణ సంస్థలు స్పష్టం చేసినప్పటికీ భారత్ బయోటెక్ నియమాల ప్రకారం 25,800 మంది వాలంటీర్లపై మానవ ప్రయోగాలు నిర్వహించామని, మార్చిలో వెలువడనున్న ఈ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని బయోటెక్ తెలియచేసింది.

Bharat Biotech seeks vaccine approval in over 40 Countries

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News