Friday, December 20, 2024

నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్‌కోవాక్’ ధర రూ. 800

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత బయోటెక్ రూపొందించిన నాసల్ వ్యాక్సిన్ ‘ఇన్‌కోవాక్’ ధర ప్రయివేట్ ఆసుపత్రుల్లోనైతే రూ. 800, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైతే రూ. 325గా ఫిక్స్‌చేశారు. 2023 జనవరి నాలుగో వారంలో ఈ వ్యాక్సిన్ జనసామాన్యానికి అందుబాటులోకి రానుంది. ‘ఇన్‌కోవాక్’ ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్. హెటెరోలోగస్ బూస్టర్ డోస్‌గా దీనిని ఇస్తారు.

ఈ నెల మొదలులోనే భారత్ బయోటెక్ రూపొందించిన ఈ ముక్కు వ్యాక్సిన్(ఇన్‌కోవాక్)కు కేంద్రీయ ఔషద నాణ్యత నియంత్రణ సంస్థ(సిడిఎస్‌సిఒ) నుంచి ఆమోదం లభించింది. బిబిఐఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ “మేము కోవాక్సిన్, ఇన్‌కోవాక్ అనే రెండు కోవిడ్ వ్యాక్సిన్‌లను రూపొందించాము. ఈ రెండింటిని వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లలో రూపొందించాము. వేర్వేరు డెలివరీ సిస్టమ్స్ వీటికున్నాయి. వెక్టర్డ్ ఇంట్రానాసల్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ మాకు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, మహమ్మారి సమయంలో వేగవంత ఉత్పత్తికి, ఉత్పత్తి పెంపుకు అవకాశం ఇస్తుంది. అత్యవసర పరిస్థితిలో, సాంక్రమిక దశలో నొప్పిలేకుండా, రోగనిరోధక శక్తిని ఈ నాసల్ వ్యాక్సిన్ అందిస్తుంది” అన్నారు.

ఇన్‌కోవాక్ మూడో దశ ప్రయోగాలను సురక్షితంగా విజయవంతంగా నిర్వహించారు. 3100 మందిపై దీనిని పరీక్షించారు.దేశవ్యాప్తంగా 14 ట్రయల్ సైట్స్‌లో వీటిని నిర్వహించారు. వాషింగ్టన్ యూనివర్శిటీ సెయింట్ లూయిస్ భాగస్వామ్యంతో ‘ఇన్‌కోవాక్’ను తయారుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News