Friday, January 24, 2025

‘భారత్ బ్రాండ్’తో ఎరువుల అమ్మకాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 2.8 లక్షల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఈ కిసాన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని వెల్లడించారు. ’భారత్ బ్రాండ్’ పేరుతో గురువారం నుంచి ఎరువుల అమ్మకాలు అమల్లోకి వస్తాయన్నారు. మొదటి దశలో రేపు లక్షా 25 వేల షాపులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శామీర్‌పేట్‌లో తాను పాల్గొంటానని తెలిపారు.

కిసాన్ కేంద్రాల్లో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో అందుబాటులో ఉంటాయని చెప్పారు. భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారన్నారు. వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు అక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సల్ఫర్ కోటెడ్ యూరియాను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రేపు ప్రధాని జమ చేస్తారన్నారు. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాలో కిసాన్ సమ్మాన్ డబ్బులు జమ అవుతాయని చెప్పారు.

 రైతులకు అందుబాటులో..
– రైతులకు అవసరమైన అన్ని సేవలను కిసాన్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అప్‌గ్రేడేషన్, అవగాహన కిసాన్ కేంద్రాల ద్వారా కృషి చేస్తామని తెలిపారు.- రైతులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర పథకాలపై ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. ఎరువులు, భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. నీమ్ కోటెడ్ యూరియా సరఫరా చేయడంతో యూరియా బ్లాక్ మార్కెట్ సమస్య పోయింది. నేల నాణ్యత పెరిగిందన్నారు. రేపటి నంచి నీమ్ కోటెడ్ యూరియాతో పాటు సల్ఫర్ కోటెడ్ యూరియా తీసుకునే వీలుందన్నారు. -పంటల బీమా పథకంతో బ్యాంకులను, రైతులను సమన్వయం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

నేడు రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు
-14వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను గురువారం ఉదయం ప్రధాని 8.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.- ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పిఓ)లను ఓపిడిసి పరిధిలోకి తీసుకొచ్చి.. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ నెట్‌వర్క్ పెంచేందుకు ప్రధాని మోడీ కార్యాచరణ ప్రకటిస్తారని వెల్లడించారు. ప్రతి నెల రెండో అదివారం కిసాన్ కి బాత్ ఉంటుందని వెల్లడించారు.- కిసాన్ సేవా కేంద్రం పరిధిలో ఉండే రైతులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. ఎప్పటికప్పుడు వాతావరణ, వ్యవసాయ, మార్కెట్ అప్‌డేట్లు అందులో పంపే కార్యక్రమాన్ని కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.
 భారీగా ఎరువులపై రాయితీ..
– 45 కిలోల యూరియా బస్తాను రైతుకు రూ.265కు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. యూరియ బస్తా అసలు ధర రూ. 2503 అంటే దాదాపు 2236 రూపాయలు కేంద్రం రాయితీగా భరిస్తున్నది. 50 కిలోల డిఎపిడీ బస్తాకి 3771 రూపాయలు కాగా.. కేంద్రం రైతులకు రూ.1311 మాత్రమే ఇస్తున్నది. అంటే ప్రతి బ్యాగ్‌పై రూ.2400 కేంద్రం భరిస్తున్నది. అంటే సగటున ఒక ఎకరం సాగు చేసే రైతుకు కేంద్రం ఎరువులపైనే రూ.18 వేలకు పైగా లబ్ధి చేకూరుస్తున్నది. అన్నీ కలుపుకొని పదెకరాలు సాగు చేసే రైతుకు దాదాపు 2 లక్షల రూపాయల పరోక్ష సాయం చేస్తున్నదని వెల్లడించారు.

ఆ మూడు పార్టీలు ఒకటే…
– రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకటేనని.. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా.. మూడు పార్టీలకు వేసినట్లే అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీల తీరును తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు.- రాష్ట్రంలో మార్పు రావాలంటే.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. అవినీతి రహిత ప్రభుత్వం రావాలంటే.. అది మోడీ నాయకత్వంలోని బిజెపితో మాత్రమే సాధ్యం. అందరూ ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News