Friday, December 20, 2024

సికింద్రాబాద్ నుండి పదవ భారత్ గౌరవ్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వేల ద్వారా నడపబడుతున్న భారత్ గౌరవ్ రైళ్లు రైలు వినియోగదారుల నుండి భారీ విజయాన్ని సాధించాయి. ఈ యాత్రకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభిస్తోంది. దీంతో పదవ భారత్ గౌరవ్ రైలు ప్రయాణాన్ని సికింద్రాబాద్ నుండి దక్షిణ మధ్య రైల్వే శాఖ బుధవారం ప్రారంభించింది. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు రేణిగుంటలలో ప్రయాణీకులకు ఎక్కే,దిగే సౌకర్యాన్ని అందిస్తుంది. మొత్తం యాత్ర 8 రాత్రులు,9 రోజుల వ్యవధిలో కవర్ చేయనుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, (ఐఆర్ సీటిసీ) ఇప్పటి వరకు రైలు ప్రయాణీకుల నుండి వచ్చిన మంచి స్పందనతో ఉత్సాహంగా, భారతదేశంలోని ఇతర ప్రసిద్ధ , ముఖ్యమైన యాత్రా స్థలాలను కవర్ చేస్తోంది.

తద్వారా భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణ కోసం మరిన్ని టూరిస్ట్ సర్క్యూట్లను ప్లాన్ చేసింది. ఇందులో భాగముగా కొత్త టూరిస్ట్ సర్క్యూట్ను జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్రను చేపట్టింది. ఈ రైలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కవర్ చేస్తుంది. ఈ రైలు బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మొదటి ట్రిప్పును ప్రారంభించింది. మొదటి జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పదవ భారత్ గౌరవ్ రైలు ప్రయాణాన్ని సీనియర్ సిటిజన్..లక్నో నివాసితులు ఈ రైలులోని యాత్రికులలో ఒకరైన సీమ ఉపాధ్యాయ్ ప్రారంభించారు. వారు జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర పాల్గొనడానికి లక్నో నుండి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తున్నారు. ఈ రైలు ప్రారంభ కార్యక్రమంలో ఐఆర్‌సీటిసీ గ్రూప్ జనరల్ మేనేజర్ పి. రాజ్‌కుమార్ , ఇతర ఐఆర్‌సీ టిసీ అధికారులు కూడా పాల్గొన్నారు. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణీకులందరికీ జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనానికి ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది, అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలైన అరుణాచలం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరులను కవర్ చేస్తుంది.

రైలు ప్రయాణీకులకు ఈ రైలు అందించే అపూర్వ అవకాశం కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే కాకుండా మార్గంలోని స్టేషన్ల నుండి కూడా ప్రయాణీకులు భారత్ గౌరవ్ రైలు సేవలను పొందేందుకు ముందుకు వచ్చారు . రైలు 2 ఏసి (1), 3 ఏసి (3) , స్లీపర్ (7) మిశ్రమ కూర్పుతో ఏసి, నాన్- ఏసి ప్రయాణీకులకు అవకాశాన్ని అందిస్తుంది. అన్ని సెగ్మెంట్ల ఆదరణను ప్రతిబింబిస్తూ, సికింద్రాబాద్ స్టేషన్‌తో పాటు వెళ్లే రెండు స్టేషన్‌ల నుండి రైలు ప్రయాణికులు ఏసి నాన్- ఏసి రైలు సేవలను పొందారు. గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించడం పట్ల దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు . యాత్రికుల ప్రయాణీకులకు వ్యక్తిగత ప్రయాణ అంశాలను ప్లాన్ చేయడంలో ఇబ్బంది లేకుండా సాంస్కృతికంగా ప్రముఖ చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి రైలు గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలోని ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News