Thursday, January 23, 2025

ఈ బిచ్చగాడు భలే రిచ్!

- Advertisement -
- Advertisement -

బిచ్చగాడు సినిమాలో రిచ్ హీరో.. బిచ్చగాడి అవతారమెత్తి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడేమో సీన్ రివర్స్. పైసాకి గతిలేని ఓ బిచ్చగాడు పైసా పైసా కూడబెట్టి, రిచ్ అయ్యాడు. అదీ సంగతి!
ముంబయికి చెందిన భరత్ జైన్ కథ ఇది. ముప్ఫై ఐదేళ్ల క్రితం భిక్షాటన మొదలెట్టాడు. పెద్ద పెద్ద సెంటర్లలో అందరినీ చెయ్యి చాపి అడుక్కుంటూ, వచ్చిన సంపాదనలో తినీ తినకా పైసా పైసా కూడబెట్టి కోటశ్వరుడయ్యాడు. ఇతనికి ఇప్పుడు ముంబయిలోని ఖరీదైన బాంద్రా ప్రాంతంలో కోటిన్నర రూపాయల విలువ చేసే రెండు ఫ్లాట్లు, ఠాణేలో రెండు దుకాణాలు ఉన్నాయి. వాటిపై లక్షల్లో అద్దె వస్తోంది.

ఖరీదైన ఈ బిచ్చగాడికి పెళ్లి కూడా అయింది. ఇద్దరు పిల్లలు. వారు ఓ కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. ఇంత సంపాదించినా, అచ్చొచ్చిన వృత్తిని వదులుకోవడమెందుకంటాడు భరత్ జైన్. ఇప్పటికీ అజాద్ మైదాన్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ వంటి ప్రధాన కూడళ్ల వద్ద అడుక్కుంటూ ఉంటాడు. ఇలా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? 75 వేల రూపాయలు! అంటే ఏడాదికి అక్షరాలా తొమ్మిది లక్షల రూపాయలన్నమాట! ఈ బిచ్చగాడిపై ఎవరైనా సినిమా తీస్తే బాగుంటుంది కదా!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News