Sunday, December 22, 2024

భారత్ జోడో న్యాయ్ యాత్రకు బెంగాల్‌లో అడ్డంకి

- Advertisement -
- Advertisement -

సిలిగురి (పశ్చిమ బెంగాల్) : పశ్చిమ బెంగాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బహిరంగ సభలు కొన్ని నిర్వహించేందుకు అనుమతులు సంపాదించడంలో కాంగ్రెస్‌కు సమస్యలు ఎదురవుతున్నాయని బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి శుక్రవారం ఆరోపించారు. అధీర్ రంజన్ సిలిగురిలో విలేకరులతో మాట్లాడుతూ, యాత్ర షెడ్యూల్‌ను చాలా కాలం క్రితమే రాష్ట్రంలో అధికార యంత్రాంగానికి సమర్పించినట్లు వెల్లడించారు. ‘కొన్ని ప్రదేశాలలో మాకు అవరోధాలు ఎదురు అవుతున్నాయి. బహిరంగ సభల నిర్వహణకు మాకు అనుమతి రావడం లేదు.

పరీక్షల సాకు చూపుతున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంతో సహా ఈశాన్య భారతంలో సమస్యలు ఎదుర్కొన్నది. ఇప్పుడు టిఎంసి పాలిత పశ్చిమ బెంగాల్‌లో సమస్యలు ఎదురు అవుతున్నాయి’ అని ఆయన వివరించారు. ‘సిలిగురిలో బహిరంగ సభ నిర్వహణకు మాకు ఆనుమతి లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం లభిస్తుందని మేము ఆశించాం. ఏమైనా యాత్ర మార్గం, తేదీల సమాచారం ఏవో కొన్ని మార్పులు మినహా యథాతథంగా కొనసాగుతాయి’ అని అధీర్ రంజన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News