న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం దేశ రాజధానిలోకి ప్రవేశించింది. యాత్రలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు పాల్గొన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా యాత్రలో పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ బిజెపిఇ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాని సామాన్య ప్రజలు మాత్రం సామరస్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
విద్వేష మార్కెట్‌లో తాను ప్రేమను విక్రయిస్తున్నానంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. ఉదయం 10.30 గంటలకు ఆశ్రమ్ చేరుకున్న యాత్ర కొద్ది సేపు విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు బయల్దేరి హజ్రత్ నిజాముద్దీన్, ఇండియా గేట్ మీదుగా రెడ్ ఫోర్ట్‌కు చేరుకుంటుంది. అనంతరం రాహుల్ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించి వచ్చే నెల 3వ తేదీ వరకు యాత్రకు విరామం ప్రకటిస్తారు. ఉత్తరాదిలో కఠినమైన శీతాకాలంలో సాగనున్న యాత్రకు సింసిద్ధం అయ్యేందుకు కంటెయినర్లతోపాటు యాత్రలో పాల్గొనే కార్యకర్తలు ఈ విరామ సమయాన్ని ఉపయోగించుకుంటారు.
Sonia Gandhi ji & @priyankagandhi are now walking in #BharatJodoYatra ❣️ pic.twitter.com/5HrrzBq3cp
— Darshnii Reddy ✋🏻 (@angrybirdtweetz) December 24, 2022