Thursday, December 19, 2024

భారత్ జోడో యాత్ర… మన్ కి బాత్ ఒకటి కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రకు మన్ కి బాత్‌కి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పష్టం చేసింది. ప్రజల ఉద్దేశ్యాలు, డిమాండ్లు ఢిల్లీకి చేరవేయడమే యాత్ర లక్షంగా హస్తంపార్టీ తెలిపింది. భారత్ జోడో యాత్రకు సంబంధించిన గీతాన్ని ఆ పార్టీ విడుదల చేసింది. కాగా, ఈ నెల కన్యాకుమారిలో రాహుల్‌గాంధీ యాత్రను ఆరంభించనున్నారు. అదేసమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు 100 భారత్ యాత్రలు ప్రారంభించనున్నాయి. కాశ్మీర్ వరకు జరిగే ఈ యాత్ర 3,570 కిలోమీటర్లు జరగనుంది. స్వతంత్ర భారతంలో ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఈ యాత్ర జరగనుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎఐసీసీ ప్రధాన కార్యాలయంలో యాత్ర గీతాన్ని విడుదల చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ రమేశ్ మాట్లాడుతూ..ప్రజల డిమాండ్లు, అభిప్రాయాలను ఢిల్లీకి చేరేలా యాత్ర జరుగుతుందన్నారు.ప్రతి నెల రేడియోలో ప్రసారమయ్యే ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. సుదీర్ఘ ఉపన్యాసాలు, బోధనలు, నాటకీయ పరిణామాలు యాత్రలో ఉండవన్నారు. ప్రజాసమస్యలు వినేందుకు తాము వెళుతున్నామని, రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేయనున్నారని జైరాం రమేశ్ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరితో దేశం రెండుగా విడిపోయిన తరుణంలో భారత్ జోడో యాత్ర అవసరం ఉందన్నారు. అక్టోబర్ 19న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న నేపథ్యంలో యాత్రకు ఎవరు అధ్యక్షత వహిస్తారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానిమిస్తూ..రాహుల్ యాత్రకు అధ్యక్షత వహించరని ఇతర నాయకులతో కలిసి ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ పాదయాత్ర చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో యాత్ర ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారని రమేశ్ వెల్లడించారు. రేపు కన్యాకుమారిలో యాత్ర ప్రారంభించేముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబుదుర్‌లోని రాజీవ్‌గాంధీ స్మారక చిహ్నం వద్ద తమిళనాడు సిఎం స్టాలిన్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేశ్ బగల్‌తో కలిసి నివాళి అర్పిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు.

Bharat Jodo Yatra is not Mann Ki Baat : Jairam Ramesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News