Monday, December 23, 2024

షెగావ్ నుంచి భారత్ జోడో యాత్ర…పెద్ద సంఖ్యలో మహిళలు

- Advertisement -
- Advertisement -

షెగావ్: మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ శనివారం 13వ రోజుకు చేరుకుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యాత్రలో పెద్ద ఎత్తున మహిళలు నడిచారు. ఉదయం 6.00 గంటలకు బుల్‌ధానా జిల్లాలోని షెగావ్‌లోని గజానన్ దాదా పాటిల్ మార్కెట్‌యార్డ్ నుంచి ఈ యాత్ర మొదలయింది. అది జలంబ్ వైపుకు కొనసాగింది. స్వయం సహాయక గ్రూపుకు చెందిన మహిళలు, ఎన్నికైన మహిళా ప్రతినిధులు ఈ యాత్రలో పాల్గొన్నారు. దారి పొడుగునా రాహుల్ గాంధీ స్థానికులతో మమేకం అవుతూ ముందుకు కదిలారు. ఆదివారం రాత్రి ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోకి ప్రవేశించనుంది. తెలంగాణ నుంచి నవంబర్ 7న మహారాష్ట్రలోకి ప్రవేశించిన ఈ యాత్ర నాందేడ్, వాషిమ్, అకోలా, బుల్ధానా జిల్లాలు కవర్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News