మధ్యాహ్నం కల్లా యూపిలోకి ప్రవేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన రెండో దశ ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం ఢిల్లీ నుంచి మొదలయింది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీరీ గేట్ వద్ద ఉన్న హనుమాన్ మందిర్ నుంచి ఉదయం మొదలయింది. మధ్యాహ్నానికల్లా ఈ యాత్ర ఔటర్ రింగ్ రోడ్ గుండా డాటి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నది. ఢిల్లీ నుంచి మొదలైన ఈ భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. కాగా నగరం ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ అనేక చోట్ల అదుపుతప్పింది. ఈ యాత్ర ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు రోజుల కొనసాగి తర్వాత గురువారం సాయంత్రం హర్యానాకు చెందిన పానీపట్‌లోకి ప్రవేశించనున్నది. కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర ఇప్పటి వరకు 3000 కిమీ. మేరకు నడిచింది.
United We Stand,
United We Move Forward!Celebrating the true spirit of our Great Nation #BharatJodoYatra pic.twitter.com/dZfRADPSvQ
— Devender Yadav (@devendrayadvinc) January 2, 2023
#WATCH | Congress' Bharat Jodo Yatra underway in Delhi; visuals from Jafrabad area pic.twitter.com/bitZKR0uN0
— ANI (@ANI) January 3, 2023