Monday, December 23, 2024

మైసూరుకు చేరుకున్న సోనియా గాంధీ

- Advertisement -
- Advertisement -

Bharat Jodo Yatra: Sonia Gandhi reached Mysore

6న రాహుల్‌తో కలసి పాదయాత్ర

మైసూరు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక మైసూరు పట్టణాన్ని చేరుకున్నారు. రెండు రోజుల విరామం అనంతరం గురువారం పునఃప్రారంభం కానున్న పాదయాత్రలో సోనియా గాంధీ పాల్గొంటారు. అనారోగ్య కారణాల వల్ల ఇటీవల జరిగిన ఎన్నికలలో సోనియా గాంధీ ప్రచారం నిర్వహించలేకపోయారు. సోనియా గాంధీ ఇటీవల కాలంలో పార్టీ నిర్వహించే ఎటువంటి బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న భారత్ జోడో యాత్రలో తమ పార్టీ అధ్యక్షురాలు కూడా పాల్గొనడం పట్ల పార్టీలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News