త్వరలో భారత్ జోడో యాత్ర వస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో మణిపూర్ నుంచి ముంబై వరకు చేప్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా తాను బస చేసిన శిబిరాల వద్ద నిర్వహించిన మార్షల్ ఆర్ట్ శిక్షణకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా తాము వేలాది కిలోమీటర్లు పర్యటించిన సమయంలో రోజూ సాయంత్రం తమ బస వద్ద జియు-జిట్సు ప్రాక్టీసు చేసేవారమని రాహుల్ ఆ పోస్టులో తెలిపారు. శారీరకంగా ఫిట్‌గా ఉండేందు కోసం తాము మామూలుగా మొదలుపెట్టిన ఈ ప్రాక్టీసు సహ యాత్రీలతోపాటు
ఆయా పట్టణాలకు చెందిన యువ మార్షల్ ఆర్ట్ విద్యార్థులను కూడా జత కలిపిందని, యువత హింసామార్గాన్ని ఎంచుకోకుండా సహోదరభావంతో మెలగాలన్నదే తమ లక్షమని ఆయన పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తాను ఈ వీడియోను షేర్ చేయడానికి కారణం ప్రజలలో స్ఫూర్తిని రగిలించడానికేనని ఆయన తెలిపారు. త్వరలో భారత్ జోడో యాత్ర వస్తుందంటూ ఆయన వెల్లడించారు. 2022 సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు భారత్ జోడో యాత్రను ప్రారంభించి 2023 జనవరిలో ముగించారు. ఏ ఏడాది జనవరి 14న భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించారు.