Saturday, January 18, 2025

12వ రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పన్నెండవ రోజు జుక్కల్ చౌరస్తా నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదలైంది. గత 12 రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. సోమవారం ఉదయం జగన్నాథ్ పల్లె మీదుగా షెహాపూర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం షెహాపూర్ వద్ద రాహుల్ భోజన విరామం తీసుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ లో భారీ బహిరంగ సభ జరగనుంది.ఇక, సభ అనంతరం భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాత్రి 9.30కి మహారాష్ట్ర పీసీసీకి జాతీయ జెండాను అందించనున్నారు. కన్యాకుమారి నుంచి 60 రోజులుగా కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర ఈరోజు తెలంగాణలో ముగియనుంది.

Bharat Jodo Yatra to enter Maharashtra today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News