Wednesday, January 22, 2025

ఎపిలోనూ భారత్ రాష్ట్ర సమితి హోర్డింగ్‌లు

- Advertisement -
- Advertisement -

Bharat Rashtra Samithi hoardings in AP

విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారాస పోస్టర్లు ఏపీలోనూ వెలిశాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో భారాస పార్టీ ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. భారాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీలోనూ భారాస హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News