Monday, December 23, 2024

కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న

- Advertisement -
- Advertisement -

జన నాయకుడికి దక్కిన అత్యున్నత పురస్కారం
మరణానంతరం ప్రకటించిన కేంద్రం
శత జయంతి కానుకగా అందిన గౌరవం
ప్రధాని మోడీ హర్షం

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటిస్తూ ఉం టుంది. ఏడాదికి సంబంధించి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూ రి ఠాకూర్‌కు ప్రకటించింది. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారతరత్నతో ప్రభుత్వం గౌరవించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మం గళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. సమస్తీపూర్ జిల్లాకు చెందిన ఠాకూర్ 24 జనవరి 1924న జన్మించారు. స్వా తంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థి నాయకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో కర్పూరి పాల్గొన్నా రు. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఆయన జైలుకు కూడా వెళ్లారు. అనంతరం జనతా పా ర్టీలో చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన కర్పూరి ఠాకూర్ డిసెంబర్ 1970 నుంచి 1971 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం రెం డోసారి డిసెంబర్ 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు ముఖ్యమంత్రిగా ఠాకూర్ పని చేశారు. 17 ఫిబ్రవరి 1988న ఆయన తుదిశ్వాస విడిచా రు. బీహార్‌లో ‘జనసేత జననాయక్‌గా ఠాకూర్ ప్రసిద్ధి చెందారు. తాజాగా భారతరత్న ప్రకటించడంతో బీహార్‌లో సంబరాలు జరిగాయి.
శతజయంతి కానుక
తొలిసారి బీహార్ నుంచి కాంగ్రెసేతర వ్యక్తిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పురస్కారం ప్రకటించింది. దీనికితోడు కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించాలని జనతాదళ్ యునైటెడ్ పార్టీ (జేడీయూ), బిహార్ ముఖ్య
మంత్రి నితీశ్ కుమార్ తరచూ డిమాండ్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా వస్తున్న డిమాండ్‌ను కర్పూరి ఠాకూర్ శత జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. భారతరత్న ప్రకటనపై బిహార్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ, కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయ పోరాటానికి దక్కిన గౌరవంగా ప్రధాని అభివర్ణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News