Saturday, January 4, 2025

భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన ఎంపి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

2024 సంవత్సరానికి గానూ భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే కేంద్రం భారతరత్నఅవార్డులను ప్రకటించిందన్నారు.

ఆదివారం ఉదయం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక సంవత్సరంలో మూడు భారతరత్న అవార్డలను మాత్రమే ఇవ్వాలని చట్టంలో ఉన్నా.. రాజకీయ లబ్ధీ కోసం ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని సర్కార్ ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలను ప్రకటించిందని అన్నారు. జయంత్ చౌదరిని బిజెపి పార్టీలో చేర్చుకునేందుకే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న అవార్డును ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News