Monday, December 23, 2024

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించిన ఘనత టిడిపిదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం భారతదేశానికే గర్వకారణమని, తెలుగువారి డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను ఇక్కడే ఘనంగా నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

తెల్ల బియ్యాన్ని పండుగ బువ్వగా, స్వామి బువ్వగా భావించే రోజుల్లో ప్రతి పేదవాడు తెల్ల బియ్యం తినేలా చేసిన ఘనత టిడిపిదేనని ఆయన పేర్కొన్నారు. ఆహార భద్రత చట్టం రాకముందే 40 ఏళ్ల క్రితమే దానిని టిడిపి అమలు చేసిందని ఆయన తెలిపారు. ఆదివారం ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం తెలంగాణలో టిడిపి చేసిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన 1000 కరపత్రాలు, పెన్ను, పుస్తకం, బొట్టుబిళ్లలతో కూడిన కిట్లను పార్టీ నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News