Sunday, December 22, 2024

మోడీ ఎదుట ‘భారత్ ’…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జీ 20 లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. శనివారం భారత్ మండపంలో జరిగిన వన్ ఎర్త్ సెషన్ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ కూర్చున్న స్థానంలో దేశం పేరును ‘ఇండియా’ కు బదులు ‘భారత్’ అని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు అంతర్జాతీయంగా భారత్‌ను ఇండియాగా గుర్తించేవారు. ఇప్పుడు తొలిసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను భారత్‌గా గుర్తిస్తూ రౌండ్‌టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. జీ 20 ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న ఛైర్ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌లో భారత్ అని రాసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News