- Advertisement -
కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిట చౌక ధరలకే బియ్యం అందించనుంది. మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు కిలో 29 రూపాయలకే ఈ బియ్యాన్ని అందించబోతోంది. బియ్యం అమ్మకాలు వచ్చేవారంనుంచే ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా విలేఖరులకు చెప్పారు.
భారత్ బియ్యాన్ని 5 కేజీలు, 10 కేజీల బ్యాగులలో నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ రిటైల్ షాపుల్లో విక్రయిస్తామని చెప్పారు. ఇ-కామర్స్ లోనూ కొనుగోలు చేయవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కిలో రూ. 27.50కు భారత్ గోధుమపిండిని, రూ. 60కి భారత్ దాల్ పేరిట శనగపప్పుని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
- Advertisement -