Monday, December 23, 2024

రూ. 200 కోట్ల పెట్లుబడితో వస్తున్న ‘భారత్ సిరమ్స్’

- Advertisement -
- Advertisement -

Bharat Serums and Vaccines Global to invest Rs 200 crore

జినోమ్ వ్యాలీలో ఇంజెక్టెబుల్ టీకా తయారీ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్ గ్లోబల్ (బిఎస్‌వి గ్లోబల్) సంస్థ తెలంగాణలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అయింది. జినోమ్ వ్యాలీలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఇంజెక్టెబుల్ వ్యాక్సిన్ తయారీ ఫెసిలిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటి మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రూ.200 కోట్ల పెట్టుబుడలతో జినోమ్ వ్యాలీలో బిఎస్‌వి గ్లోబల్ ఇంజెక్టెబుల్, వ్యాక్సిన్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నదని ప్రకటించడానికి సంతోషఃగా ఉన్నదని కెటిఆర్ ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‌లో బిఎస్‌వి గ్లోబల్ ఎండి సంజీవ్ స్నవంగుల్ జీకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రపంచానికి టీకా కేంద్రం అనే విషయాన్ని ఈ నిర్ణయం బలపరుస్తున్నదని పేర్కొన్నారు.

బయోలాజికల్, బయోటెక్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌లలో కంపెనీకి విశేష కీర్తి ఉన్నది. గైనకాలజీ, పునరుత్పత్తికి సహకరించే టెక్నాలజీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ మెడికల్, నెఫ్రాలజీ, హెమటాలజీ, యూరాలజీలలో ఈ కంపెనీ కృషి ఉన్నది. పెట్టుబడుల కోసం ఇటీవలే కేటిఆర్ యూఎస్ టూర్ చేపట్టిన సంగతి విదితమే. అదే విధంగా ఏ అవకాశం చిక్కినా ఎంట్రాప్రెన్యూయర్లను హైదరాబాద్ వైపు రప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిణామమే ఈ నెల 4న ట్విట్టర్‌లో చోటు చేసుకుంది. టెక్ ఎంట్రాప్రెన్యూయర్లకు టాప్ సిటీ హైదరాబాద్? బెంగళూరా అనే చర్చ జరిగింది. ఇది కామన్ మెన్ మధ్య జరిగిన చర్చ కాదు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్‌ల మధ్య ట్విట్టర్ ఎక్స్‌ఛేంజ్ జరిగింది. అంతేకాదు, పరస్పరం సవాళ్లు చేసుకుని అంగీకరించారు కూడా. ఆ చర్చ ఇలా సాగింది.

హౌజింగ్ డాట్ కామ్, ఖాతాబుక్ స్టార్టప్‌ల వ్యవస్థాపకుడు రవీశ్ నరేశ్ ఇటీవల బెంగళూరులో మౌలిక సదుపాయాల గురించి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ప్రతి రోజూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మరో స్టార్టప్ చీఫ్ కూడా ఆయన వాదనలతో అంగీకరించారు. ఈ సంభాషణలో తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ కూడా జాయిన్ అయ్యారు. బ్యాగులు సర్దుకుని హైదరాబాద్‌కు వచ్చేయండి అని వారికి సూచించారు. ఇక్కడ మెరుగైన వసుతులు ఉన్నాయని, తాము ముఖ్యంగా ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్‌పైన ఫోకస్ పెడుతున్నామని వివరించారు.

ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ రియాక్ట్ అయ్యారు. మై ఫ్రెండ్ కెటిఆర్.. మీ సవాలును స్వీకరిస్తున్నా అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది చివరికల్లా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. ఆ తర్వాత భారతదేశంలో బెస్ట్ సిటీగా బెంగళూరు ఘనతను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు మంత్రి కెటిఆర్ కూడా మళ్లీ జవాబు ఇచ్చారు. ప్రియమైన డికె శివకుమార్ అన్నా.. కర్ణాటక రాజకీయాల గురించి తనకు పెద్దగా తెలియదని, ఎవరు గెలుస్తారో కూడా తనకు తెలియదని పేర్కొన్నారు. కానీ, సవాల్‌ను మాత్రం స్వీకరిస్తున్నట్లు వివరించారు. యువతకు ఉపాధిని కల్పించడంలో ఆరోగ్యకరమైన వాతావరణంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు పోటీ పడనిద్దాం అని తెలిపారు. కాబట్టి, హలాల్, హిజాబ్‌లపై కాదు.. ఐటి అండ్ బిటి, మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెడదామని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News