Wednesday, January 8, 2025

జి20 అతిథులకోసం ‘భారత వాద్య దర్శనం’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జి20 సదస్సుకోసం హాజరయ్యే వివిధ దేశాల నేతలకు సిద్ధహస్తులైన వాద్య కళాకారులు భారతీయ సంగీత వారసత్వ సంపదను పరిచయం చేయనున్నారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సంగీత రీతులను వీరు ఆధునిక సంగీతంతో మేళవించి అతిథుల వీనులకు విందు చేయనున్నారు. ‘ భారత వాద్య దర్శనం’ పేరుతో ‘ గాంధర్వ ఆతోద్యం’ గ్రూపు ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తుంది. ఈ నెల 9న జి20 సదస్సుకోసం హాజరయ్యే దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందు సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. సంతూర్, సారంగి, జలతరంగ్, షెహనాయ్ తదితర భారతీయ క్లాసికల్ వాద్య పరికరాలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయని, సంగీత నాటక అకాడమీ దీన్ని రూపొందించిందని దీనికి సంబంధించి విడుదల చేసిన బ్రోచర్‌లో పేర్కొన్నారు.

హిందుస్థానీ, కర్నాటక జానపద సంగీత రీతులతో పాటుగా సమకాలీన సంగీతం కూడా ఇందులో ఉంటుంది. దేశం నలుమూలలకు చెందిన 78 వాద్య పరికరాలు ఇందులో పాలు పంచుకుంటాయని ఆ అధికారి చెప్పారు. #4 హిందుస్థానీ వాద్య పరికరాలు, 18 కర్నాటక సంగీత వాద్య పరికరాలు, 26 జానపద సంగీత పరికరాలు ఇందులో పాలు పంచుకుంటాయి. ఇందులో పాల్గొనే 78 మంది కళాకారుల్లో 11 మంది చిన్నారులు, 13 మంది మహిళలు, ఆరుగురు దివ్యాంగులు, 26 మంది యువ కళాకారులు, 22 మంది వృత్తి కళాకారులు ఉన్నారని ఆ బ్రోచర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని కూడా పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News