Thursday, December 26, 2024

క్రైమ్ కామెడీ మూవీ..

- Advertisement -
- Advertisement -

పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే.. కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడు కెవిఆర్ మహేంద్రతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా రాశారు. పిఆర్ ఫిలమ్స్ బ్యానర్‌పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి గోస్వామి హీరోయిన్. మేకర్స్ ఈరోజు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేసారు. ఈ చిత్రానికి ‘భరతనాట్యం’ అనే క్లాసిక్ టైటిల్‌ని లాక్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యూనిక్‌గా డిజైన్ చేశారు. క్రైమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమా పోస్టర్‌లో సూర్య తేజ షేడ్స్‌తో ట్రెండీ, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘భరతనాట్యం’ షూటింగ్ మొత్తం పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News