Monday, January 20, 2025

ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి సరోజా వైద్య నాథన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ భరతనాట్య కళాకారిణి సరోజా వైద్యనాథన్ (86) ఢిల్లీ లోని తన నివాసంలో గురువారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈనెల 19 నాటికి ఆమెకు 86 ఏళ్లు వచ్చాయని ఆమె కోడలు , నృత్యకళాకారిణి రామ వైద్యనాథన్ చెప్పారు. 2002లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్న సరోజా వైద్యనాథన్ 10 సంపూర్ణ రూపకాలను, దాదాపు 2000 నృత్యకళారీతులను ప్రదర్శించి విశేష కీర్తి సాధించారు. ఢిల్లీలో గత 50 ఏళ్లుగా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఇచ్చే గణేశ నాట్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు లోథీ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని రామ వైద్యనాథన్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News