Friday, December 20, 2024

‘ఇండియన్ 2’ నుంచి రకుల్, సిద్ధార్థ్ లవ్ సాంగ్ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషనల్ లో తెరకెక్కిన సినిమా భారతీయుడు-2. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, తొలి సాంగ్ కు మందిచ స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్‌పై రూపొందిన లవ్ సాంగ్ ప్రోమోను ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News