Saturday, December 21, 2024

నా భార్య స్టార్ హీరోయిన్ అయ్యేది: బాలకృష్ణ అల్లుడు కామెంట్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వారసుడిగా టాలీవుడ్‌లోకి వచ్చిన బాలకృష్ణ నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 60 ఏళ్ల వయసులో మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాలీవుడ్‌లో డైలాగ్ డెలవరీలో బాలయ్య మించిన నటుడు లేడు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా త్వరంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ కోసం కథ రెడీ చేసినట్టు సమాచారం. కుమారుడు కంటే చిన్న కూతురు తేజస్విని ముందుగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తెర ముందు కాకుండా తెర వెనుక బాలయ్య సినిమాలకు ఎంతో కృషి చేస్తూ విజయాలకు కారణమవుతున్నారు.

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ కార్యక్రమం సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారంటే మొదటి గుర్తుకు వచ్చే పేరు తేజస్వినిది. ఆమె భర్త శ్రీ భరత్ పార్లమెంట్ ఎన్నికలలో టిడిపి తరుపున ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం భరత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తేజస్విని చాలా తెలివి గల అమ్మాయి అని, ఆమె కనుక సినిమాల్లో నటించి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యేదని ప్రశంసించారు. అందంలో తేజస్విని ఏమాత్రం తీసిపోదని, హీరోయిన్‌గా వచ్చి ఉంటే మాత్రం నిజంగానే స్టార్ హీరోయిన్ అయ్యేదన్నారు. ఈ వ్యాఖ్యలను బాలయ్య అభిమానులు వైరల్ చేస్తున్నారు. జై బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News