Thursday, December 26, 2024

భారతి భారతి ఉయ్యాలో…

- Advertisement -
- Advertisement -

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటీనటులుగా సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను రిలీజ్ చేశారు. రానున్న దసరా పండుగ సందర్భంగా ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈక్రమంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. “రజాకార్ సినిమాలో భారతీ భారతీ ఉయ్యాల పాటకు ఓ నేపథ్యం ఉంటుంది. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చి పండుగ జరుపుకుంటుంటే.. ఇక్కడ మాత్రం రజాకార్లు మన జెండాను ఎగరవేస్తే చంపేస్తారు. ఆ సందర్భంలో ఈ పాట వస్తుంది”అని అన్నారు. దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ.. “ఇప్పుడు బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి.

మా పాట, ఆటలో ఆనందం ఉంది, ఆనందంలో ఆవేదన ఉంది.. పండుగలోనే పాట ఉంది.. పాటలోనే కష్టం ఉంది.. అవన్నీ చెప్పే అదృష్టం రజాకార్ చిత్రంతో దొరికింది. ఇది వాస్తవంగా జరిగిన కథ” అని తెలిపారు. అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. “రజాకార్ సినిమాలో నేను సగటు మహిళగా నటించాను. నిజం చెప్పేందుకే ఈ సినిమాను తీశారు. ఇది కల్పిత కథ కాదు. ఇలాంటి ఓ సినిమాలో ఓ పాటను చేశాను అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుష్య త్రిపాఠి పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News