Monday, December 23, 2024

సుప్రీం కోర్టులో భారతి సిమెంట్స్ కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

సుప్రీంకోర్టులో భారతి సిమెంట్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. భారతీ సిమెంట్స్ ఎఫ్ డీలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పబట్టింది. జగన్ అక్రమాస్తుల కేసులో గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భారతీ సిమెంట్స్ కు చెందిన రూ.150 కోట్లు విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో  సవాలు చేసింది. ఈడీ వాదనలతో జస్టిస్ అభయ్ ఒఖా నేృతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని ఎఫ్ డీలు విడుదల చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

గత తీర్పును మరోసారి పరిశీలించాలని హైకోర్టుకు, సుప్రీంకోర్టు సూచించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకున్నాక ఎఫ్ డీలు జప్తు చేశారని భారతి సిమెంట్స్ న్యాయవాది పేర్కొన్నారు. ఈడీ జప్తు చేసిందని భారతి సిమెంట్స్ న్యాయవాది ముకుల్ రోహతీ తెలిపారు. ఎఫ్ డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలని మరో పిటిషన్ వేసింది భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్ అదనపు పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ అభయ్ ఒఖా ధర్మాసనం ప్రకటించింది. అభ్యంతరాలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News