Friday, December 20, 2024

ఆర్‌టిసి బస్సు చక్రాల కింద నలిగి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై స్కూటీని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో యువతి రోడ్డుపై పడిపోయింది. వెనక నుంచి వచ్చిన యువతిపై నుంచి పోవడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. మృతురాలు ఎపిలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన ఆమెగా పోలీసులు గుర్తించారు. సదరు యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది.

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బకోట్ గ్రామం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తానూర్‌కు చెందిన శివాజీ(34)గా పోలీసులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News