హైదరాబాద్:దేశంలో ఫిన్‌టెక్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన భారత్‌పే గ్రూప్ నేడు, తాము ఉమెన్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (డబ్ల్యుఈపీ)తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశ వ్యాప్తంగా మహిళా వ్యాపారవేత్తలు స్వీయ సమృద్ధి సాధించేందుకు, వ్యాపారాభివృద్ధికి తోడ్పడటం లక్ష్యంగా చేసుకున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలను ఒక చోట చేర్చి, వారికి అవసరమైన డొమైన్ పరిజ్ఞానంతో పాటుగా వారి వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవసరమైన ఆర్ధిక మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే బలమైన పర్యావరణ వ్యవస్ధను నిర్మించడం ఈ భాగస్వామ్య లక్ష్యం. విస్తృత శ్రేణి అభ్యాస అనుభవాలు మరియు నెట్‌వర్క్ ఛానెల్స్, మెంటార్‌షిప్, పీర్ సపోర్ట్ ను అందించే మొట్టమొదటి యాగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌గా అభివృద్ధిని సులభతరం చేస్తుంది.
భారత్‌పే గ్రూప్ యొక్క కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం భారత్‌పే కేర్స్ కింద ప్రారంభించబడినది ఈ భాగస్వామ్యం. ఈ నిర్ధిష్టమైన కార్యక్రమం భారత్‌పే కంపెనీ, పేబ్యాక్ సీఎస్‌ఆర్ కార్యక్రమంగా ఉంటుంది.
భారత్‌పే సీఎఫ్‌ఓ మరియు ఇంట్రీమ్ సీఈఓ నలిన్ నేగి మాట్లాడుతూ ‘‘స్టార్టప్ మరియు యునికార్న్ హబ్‌గా ఇండియా వెలుగొందుతుంది. అయినప్పటికీ దేశంలో మహిళా వ్యాపార వేత్తల సంఖ్య స్వల్పం, భారతదేశంలో మహిళల్లో వ్యవస్ధాపక సామర్థ్యం ఒడిసిపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో మహిళా వ్యవస్ధాపకతను నడిపించడంలో నిష్కళంకమైన పనిని కలిగి ఉంది మరియు మహిళా పారిశ్రామిక వేత్తలు, వారి వ్యాపారాల వృద్ధిని మెరుగుపరిచే రీతిలో ఈ భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. భారతదేశంలో 2030 నాటికి 150–170 మిలియన్ ఉద్యోగాలను మహిళా వ్యవస్థాపకులు వృద్ధి చేయగలరని అంచనా. అందువల్ల, వీరిని ప్రోత్సహిస్తే ఆర్థిక వ్యవస్ధ మెరుగుపడటంతో పాటుగా ఉపాఽధి కల్పన కూడా సాధ్యమవుతుంది’’ అని అన్నారు.
డబ్ల్యుఈపీ, మిషన్ డైరెక్టర్ అన్న రాయ్ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో వ్యవస్థాపకత మెరుగుపడుతుంది. అయినప్పటికీ మహిళా నేతృత్వంలో వ్యాపారాలు ఇప్పటికీ మెరుగుపడాల్సి ఉంది. దేశవ్యాప్తంగా మహిళా వ్యవస్ధాపకులు మెంటార్‌షిప్ అవకాశాలతో పాటుగా నెట్‌వర్క్ ఛానెల్స్ పరంగానూ వివక్ష ఎదుర్కొంటున్నారు. భారత్‌పేతో భాగస్వామ్యంతో డబ్ల్యుఈపీ మరో ముఖ్యమైన స్టేక్‌హోల్డర్ ను జోడించుకుంది’’ అని అన్నారు.