- Advertisement -
జైపూర్: భార్యను భర్త తుపాకీతో కాల్చి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్‌లోని పహాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎఖంకా గ్రామంలో వాజీద్, షానాజ్ అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. చిన్న విషయంలో ఇద్దరు గొడవ పడుతుండగా వాజీద్ గన్ తీసుకుని తన భార్యపై కాల్చాడు. వెంటనే భర్త ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికులు భార్యను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దర్యాప్తు కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read: రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..
- Advertisement -