Monday, December 23, 2024

ఎయిర్‌టెల్ అదుర్స్

- Advertisement -
- Advertisement -

Bharti Airtel Q1 net profit jumps 466 percent

క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.1,607 కోట్లు చేరిన లాభం
గతేడాదితో పోలిస్తే 466 శాతం వృద్ధి
ఆదాయం రూ.18,220 కోట్లతో 27% జంప్

న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ నికర లాభం రూ.1,607 కోట్లతో 466 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయం లో సంస్థ లాభం రూ.284 కోట్లుగా ఉంది. కంపె నీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ.32,805 కోట్లతో 21 శాతం పెరగ్గా, గతేడాదిలో ఈ ఆదాయం రూ.27,064 కోట్లుగా ఉంది. దేశీయంగా భారతీ ఎయిర్‌టెల్ మొబైల్ సర్వీసెస్ ఆదాయం రూ.18,220 కోట్లతో 27 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 14,305 కోట్లుగా ఉంది. కంపెనీ ఆర్పు (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ.146 నుంచి రూ.183కు పెరిగింది. ప్రత్యర్థి సంస్థలు రిలయ న్స్ జియో, వొడాఫోన్ ఐడియా ఆర్పు వరుసగా రూ.175.7, రూ.128 ఉన్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ షేరు రూ. 704.35తో ఫ్లాట్‌గా ముగిసింది.

ఎయిర్‌టెల్ ఎం డి, సిఇఒ గోపాల్ విఠల్ మాట్లాడుతూ, మరో త్రై మాసికంలో కంపెనీ అద్భుతమైన లాభాలను నమోదు చేసిందని, ఇదే విధంగా వృద్ధిని కొనసాగిస్తామని అన్నారు. ఎబిటా మార్జిన్ ప్రస్తుతం 50.6 శాతంగా ఉంది. త్వరలోనే 5జి స్పెక్ట్రమ్ సేవలను కంపెనీ ప్రారంభించనుందని ఆయన తెలిపారు. ఈ నెలలో 5జి నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు గాను స్వీడన్ కంపెనీ ఎరిక్సన్, ఫిన్లాండ్ సంస్థ నోకియా, కొరియా సంస్థ సామ్‌సంగ్‌లతో ఎయిర్‌టెల్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. సామ్‌సంగ్‌తో భాగస్వామ్యం ఈ ఏడాది నుంచి ప్రారం భం కానుందని టెలికాం సంస్థ ప్రకటించింది. దే శీయ తొలి 5జి స్పెక్ట్రమ్ వేలంలో 900 మెగాహె ర్ట్, 1800 మెగాహెర్ట్, 2100 మెగాహెర్ట్, 3300 మెగాహెర్ట్, 26 గిగా హెర్ట్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో ఎయిర్‌టెల్ 19867.8 మెగాహెర్ట్ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లతో సొంతం చేసుకుంది. ఈ బ్యాండ్‌లతో ఎయిర్‌టెల్ దేశంలోని కీలక నగరాల్లో 5జి సేవలను ప్రారంభించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News