Saturday, November 16, 2024

మొబైల్ టారీఫ్‌లు పెంచబోతున్న ఎయిర్‌టెల్

- Advertisement -
- Advertisement -
airtel
నవంబర్ 26 నుంచి 20-25 శాతం పెరుగనున్న ప్రీపెయిడ్ రేట్లు

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో 5జి నెట్‌వర్క్ రానున్నది. దానిలో కాలుమోపడానికి ఎయిర్‌టెల్ ప్రయత్నిస్తోంది. అయితే అందుకు తగినంత ధనాన్ని సమీకరించుకోడానికి ఇప్పుడున్న మొబైల్ టారీఫ్‌లను మార్చబోతున్నది. నవంబర్ 26నుంచి ప్రీపెయిడ్ టారీఫ్‌లను 20-25 శాతం మేరకు పెంచబోతున్నది. భారతీ ఎయిర్‌టెల్ బిఎస్‌ఇకి దాఖలుచేసిన దస్త్రాల్లో మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఎఆర్‌పియూ)ను రూ.200 చివరికి రూ. 300 వరకు మెయిన్‌టెయిన్ చేయాల్సిన అవసరముందని తెలిపింది. మూలధనం మీద హేతుబద్ధమైన ఆదాయం అన్నది ఆరోగ్య వ్యాపార మోడల్‌కు అవసరమని పేర్కొంది. నవంబర్ 26 నుంచి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారీఫ్‌లు ఇలా ఉండనున్నాయి:
28 రోజుల వ్యాలిడిటీకి ఇప్పుడున్న రూ. 75 టారీఫ్‌ను రూ. 99కి పెంచుతారు. రూ. 149ను రూ. 179కి పెంచుతారు. రూ. 219 టారీఫ్‌ను రూ. 265కు పెంచుతారు. రూ. 249 టారీఫ్‌ను రూ. 299కి పెంచుతారు. రూ. 298 టారీఫ్‌ను రూ. 359కి పెంచుతారు.

ఇలాగే 56 రోజుల టారీఫ్‌లను, అలాగే 84 రోజుల టారీఫ్‌లను, 365 రోజుల వ్యాలిడిటీ పీరియడ్ టారీఫ్‌ను కూడా పెంచుబోతున్నారు. ఇక ఇప్పుడున్న రూ. 48 డేటా టాపప్‌ను రూ. 58కి, రూ. 251 డేటా టాపప్‌ను రూ. 301కి పెంచబోతున్నారు.

tariff

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News