Monday, December 23, 2024

తల్లిదండ్రులను అతి కిరాతకంగా చంపిన కుమారుడు…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మద్యానికి బానిసగా మారి తల్లిదండ్రులను కన్న కుమారుడు చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వృద్ధ దంపతులు భాస్కర్(63), శాంత(60) బ్యాటరాయపురలోని న్యూటింబర్ డిపో లేఔట్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. భాస్కర్ ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమారుడు మరో చోట ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు శరత్(26) మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు.

Also Read: కొడుకు చదువుకోసం తల్లి ప్రాణత్యాగం

శరత్ మద్యానికి బానిస కావడంతో పలుమార్లు తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. సోమవారం రాత్రి మద్యం తాగి శరత్ ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఇనుప రాడ్ తీసుకొని తల్లిదండ్రుల తలలపై కొట్టి పారిపోయాడు. ఇద్దరు రక్తపు మడుగులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శరత్ మానసిక రోగి అని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News