Monday, December 23, 2024

బ్యాంకులను బిజెపోళ్లు దివాలా తీయిస్తున్నారు: భట్టి

- Advertisement -
- Advertisement -

Bhatti Vikramarka slams on PM Modi

హైదరాబాద్: బహుళ జాతి సంస్థలకు కొమ్ముకాస్తూ దేశ వినాశనానికి పాల్పడుతున్న బిజెపి పరిపాలన నుంచి దేశ రక్షణ కోసం స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాలని సిఎల్ పి నేత భట్టి విక్కమార్క పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేక సంస్థలను, వ్యవస్థలను ఆస్తులను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసిందని,  కాంగ్రెస్ సృష్టించిన సంపదను బిజెపి కొల్లగొడుతుంటే స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మౌనంగా ఉందామా? కళ్ళ ముందే బిజెపి ఆస్తులను అమ్మేస్తుంటే తెగించి కొట్లాడాల్సిన కర్తవ్యం కాంగ్రెస్ కార్యకర్తలపైనే ఉందన్నారు.

దేశాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పంచవర్ష ప్రణాలికను ఏర్పాటు చేసిందని,  20 సూత్రాలు ప్రవేశపెట్టి బ్యాంకులను జాతీయం చేస్తే బడా పెట్టుబడిదారులు కార్పొరేటర్లు తీసుకున్న అప్పులను మాఫీ చేసి బ్యాంకులను దివాలా తీస్తుందని మోడీ పభుత్వంపై భట్టి మండిపడ్డారు

నిత్యవసర ఆహార వస్తువులపై జిఎస్టీ విధించి మోడీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతుందని, సామాన్య ప్రజానీకం బతకడానికి వీలు లేకుండా పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబం బతకలేని దుస్థితి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి చేస్తున్న ఆకృత్యాలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇడి, ఐటి, సిబిఐలను ఉసి గొల్పి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆజాది అమృత్ ఉత్సవాల పేరిట జెండా పండగ చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ధరలు పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాటిని కంట్రోల్ చేయడానికి చర్యలు చేపట్టిందని భట్టి గుర్తు చేశారు. బహుళ జాతి కంపెనీలకు గ్యాస్, పెట్రోల్, డీజిల్, కూరగాయలు, నిత్యవసర వస్తువుల కట్టబెట్టడానికే ఈ ధరలు పెరుగుదలని ధ్వజమెత్తారు. ఎఐసిసి కార్యాలయంలోకి పోలీసులను పంపిస్తున్నారని, మనం చూస్తూ ఊరుకుంటే ఇంతకన్నా తప్పిదం ఉండదని,  నేషనల్ హెరాల్డ్ పేపర్ కి తాళాలు వేయడం దేశ స్వాతంత్ర్యన్ని అవమానించడమేనని మోడీ ప్రభుత్వానికి చురకలంటించారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన స్వాతంత్ర సంగ్రామ పోరాట ఫలితమే నేడు జరుపుకుంటున్న 75 సంవత్సరాల ఆజాద్ అమృత్ మహోత్సవ ఉత్సవాలు అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News