Wednesday, January 22, 2025

ఫార్ములా ఈ రేస్‌పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్‌పై మాజీ మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. మంగళవారం భట్టి మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్‌పై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని, ఫార్ములా ఈ రేస్ వెనక్కి వెళ్లడంతో నష్టం జరిగిందని బిఆర్‌ఎస్ నేతలు అంటున్నారన్నారు. ఫార్ములా ఈ రేస్‌పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలన్నారు. ఫార్ములా ఈ రేస్ టిక్కెట్లు అమ్ముకొని ఓ కంపెనీ లబ్ధిపొందిందని, ఫార్ములా ఈ రేస్‌లో ముగ్గురు వాటాదారులు ఉన్నారని తెలిపారు. ప్రతీ పైసా తెలంగాణ ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని భట్టి స్పష్టం చేశారు.

ఫార్ములా ఈ రేస్ విసయంలో గతంలో ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగిందని, ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్ మార్చారని దుయ్యబట్టారు. రేస్ ద్వారా టికెట్లు అమ్ముకుని లబ్ధి పొందాలని ఎస్ నెక్ట్, జెన్ కంపెనీ యత్నించిందని, ఫార్ములా ఈ రేస్, ఎస్ నెక్ట్, జెన్ , ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. ఫార్ములా ఈ రేస్ ద్వారా తెలంగాణకు ఎలాంటి ఆదాయం లేదని, ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్ సదుపాయం కల్పించాలని, ఫార్ములా ఋ రేస్‌కు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించాలని ఉందని, ఈ రెస్‌కు డబ్బులు చెల్లించి అనుమతులు ఇప్పించాలని ఒప్పందం ఉందన్నారు. రేస్‌కు సంబంధించి రూ.55 కోట్లు చెల్లించారని, మిగతా రూ.55 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసు వచ్చిందని చెప్పారు. బిజినెస్ రూల్స్‌కు భిన్నంగా గత ప్రభుత్వం తప్పిదం చేసిందని, గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News