హైదరాబాద్: దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని వాళ్లకు కావాల్సి వారికి మోడీ ప్రభుత్వం అమ్మేస్తుందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ భట్టి విక్రమార్క మండిపడ్డారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఇడి విచారణకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. నిత్యవసర వస్తువులను సామాన్యులు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రజల పక్షాలన కాంగ్రెస్ పోరాడుతుంటే మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న వ్యక్తికి ఇడి డైరెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చారని, దీక్షలో ఎఐసిసి కార్యదర్శి బోస్ రాజు, కాంగ్రెస్ రాష్ట్ర నేతలు చిన్నారెడ్డి, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్, తదితరలు పాల్గొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు విపక్షాలు లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని లేఖలో పేర్కొన్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఇడి, సిబిఐలను ఉసిగొల్పుతుందని విపక్షాలు మండిపడ్డాయి. నిత్యావసర ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో చర్చలు జరగాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్రం చేస్తోందని మండిపడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.