Wednesday, January 22, 2025

ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోంది: భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద ఇండియా కూటమి పక్షాలు ధర్నా చేపట్టాయి. పార్లమెంటులో విపక్ష ఎంపిల సస్పెన్షన్‌కు నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోందని భట్టి మండిపడ్డారు. పార్లమెంటు ఘటనపై హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News