Monday, December 23, 2024

భట్టి పాదయాత్ర @ 102 రోజులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: సిఎల్ పి నేత,ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది.ఏ ఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధి కాశ్మీర్ నుంచి క న్యకుమారి వరకు చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కార్యక్ర మం కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్క్ ఈ ఏడాది మార్చి16న ఆదిలాబాద్ జిల్లా బోద్ నియోజకవర్గంలో బజరహాత్నూర్ మండ్లం పిప్పిరి గ్రా మం నుంచి మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇప్పటి వరకూ 15 జిల్లాల్లోని750కి గ్రామాలమీదుగా 32 నియోజక వర్గాల్లో పూర్తయ్యిం ది.నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లిలో 1000 కిలోమీటర్లమైలు రాయి మార్క్ ను దాటడంతో అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. భగభగ మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాలు.. గా లి దుమారాలు, నిప్పుల కొలిమిలోంచి వస్తున్నాయా అనిపించే వేడిగాలులు వంటి అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు నడుమ వంద రో జుల్లో 1150 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు .బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల్, రామ్గుగుండం, ధ్మ్ప్రురి, పెద్ద్ప్ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ్ధ్న్రే్న్పట్, వ్రంగ్ల్ వెస్ట్, స్టే స్టేషన్‌ఘానాపూర్, జనగాం, అలేరు, భువనగిరి, ఇబ్రీంపట్నం, ఎల్‌బి నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ళ, షాద్‌నగర్,పరిగి, జడ్చ ర్ల,,నాగకర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జున సా గర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గల్లో పాదయాత్ర కొనసాగింది.

మొత్తం32 నియోజకవర్గాల్లో 1150 కి మీ పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర శనివారం నాటికి సూర్యాపేట జిల్లా లోకి ప్రవేశించనుంది.శనివారం ఉదయం న కిరేకల్ నియోజకవర్గంలో కేతపల్లి మండలం కొప్పులు నుంచి ఈ యాత్ర బయలుదేరింది.కేతేపల్లిలో వడదెబ్బకు గురైన అస్వస్థతకు గురై విశ్రాంతి తీసుకున్న తరువాత శుక్రవారం యాత్ర ప్రారంభించారు. .ఏ ఐ సిసి అనుమతి ఇచ్చిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యనాయకులంతా గ్రూపులకు అతీతంగా సంఘీభావం తెలుపుతున్నారు. భట్టి పాదయాత్ర ఏఐసిసి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సహితం ఆరా తీసి అభినందించారు. యాత్రకు కలసిన ఏర్పాట్లు చేయాలనీ రా ష్ట్ర పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి లు అన్ని జిల్లాల డిసిసిలను ఆదేశించారు .భట్టి పాదయాత్ర నేపధ్యంలో 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సి ఎల్ పి నేత అయిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మహా ప్రస్ధానం పేరుతో చేపట్టిన పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. మండుటెండలో ఈ యాత్రను ప్రారంభించగా ఎండలను సై తం లేక్కచేయకుండా నిర్వీరామంగా కొనసాగింది.అంతేగాక అకస్మికంగా వచ్చిన అకాల వర్షాల్లో తడుస్తూ ,ఎండలో ఎండుతూ తన పాదయాత్రను కొనసాగించారు.ఈ సందర్బంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.ఈ సందర్బంగా అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు.

పాదయాత్ర మార్గమధ్యలో అనేక రంగాలవారితో,కులవ్రత్తుల వారితో సమావేశం అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నిరుద్యోగులతో ముఖాముఖీ అయి వారికి అభయం ఇచ్చారు. అన్ని జిల్లాలో కాంగ్రెస్ నాయకులు వర్గాలకు అతీతంగా పాదయాత్ర విజయవంతం కోసం కృషి చేశారు. భారత రాజ్యంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే హజరయ్యారు ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూత్తనోత్సాహం కలిగిస్తుంది. అనేకమంది నేతలు భట్టి యాత్ర కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పాదయాత్ర దారిలో పలు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమాను లు తమ ఇళ్లకు రావాలని భట్టిని ఆహ్వానిస్తున్నారు. ఉదయం పది కి మీ సాయంత్రం 10 కి మీ వరకు నడుస్తున్నారు.కాలకు బొబ్బలు రా కుండా ప్రతి రోజు మధ్యాహ్నం ,సాయంత్రం మసాజ్ చేయించుకుంటున్నారు .మండే ఎండల్లో నడవడం వల్ల మే 18న మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి గ్రా మంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ తో స్వల్ప అస్వస్థతకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురయ్యారు. వైద్యుల సూచనతో 5 రోజులు విశ్రాంతి తరువాత మళ్లీ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆయన మొదలు పెట్టారు. జడ్చెర్ల నియోజకవర్గం కేశవరాంపల్లిలో 800 కిలోమీటర్ల చేరుకోవడంతో పాటుగా.. మే 25న జడ్చెర్ల పట్టణంలో పీపుల్స్ మార్చ్ భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రజల మధ్యే పండగలు
పాదయాత్ర మొదలైనప్పటి నుంచి వచ్చిన పండుగలను ప్రజలతోనే జరుపుకున్నారు.మార్చి 22న ఉగాది పండుగను కెరిమెరి మండలం గిరి గ్రామం వద్ద ఆదివాసులు, గిరిజనులతో కలిసి కుటుంబసమేతం గా జరుపుకున్నారు. ఆదివాసులు, గిరిజనులు, దళితులు, ఇతర అన్ని వర్గాలతో కలసి సహంపక్తి భోజనాలు చేశారు. మార్చి 30న బెల్లంపల్లి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు ఏప్రిల్ 21న రంజాన్ పండుగను హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శాంతి నగర్ శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా జరుపుకున్నా రు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ముస్లిం సోదరులకు ప్రత్యేకం గా ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో ముగింపు
ఈ యాత్ర జూలై మొదటి వారంలో ఖమ్మం జిల్లాలో ముగిసేవిధంగా రూట్ మ్యాప్ ను ఖారారు చేశారు.దాదాపు 30 జిల్లాలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల మీదు గా మొత్తం 1500 కమీ వరకు పాదయాత్ర కొ నసాగే విధంగా రూట్ మ్యాప్ ను తయారు చేశారు. సూర్యాపేట జిల్లా మీదుగా ఖమ్మం జిల్లా లో కి ఈ యాత్ర ప్రవేశిస్తుంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో భట్టి పాదయాత్ర కొనసాగుతుంది. ఖమ్మంనగరంలో జూలై 2 నుంచి 5వ తేది మధ్య ఎదో ఒక్క రోజు జరిగే ముగింపు బహిరంగ సభకు ఏఐసిసి అగ్రనేత రా హుల్ గాంధి హాజర్ కానున్నారు.
ఇప్పటికే సభ ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఎస్ ఆర్ గార్డెన్ సమీపంలో ఈ సభ జరగనుంది.ఈ సభలోనే మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News