Monday, December 23, 2024

ట్రెండ్ క్రియేటర్ గా భట్టి విక్రమార్క..

- Advertisement -
- Advertisement -

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ వందో రోజుకు చేరింది. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ సెలబ్రేషన్ గా మారింది. మండుటెండల్లో పేదల మధ్యే భట్టి గ్రామా గ్రామాన తన యాత్ర సాగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కష్టాల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం అండ, ఆశీస్సులతో ఒక్కో అడుగుతో బీఆర్ఎస్ లో టెన్షన్ పెంచారు. పార్టీ నేతలను ఏకం చేసారు. ఇతర పార్టీల నేతలు కదలి కాంగ్రెస్ లో కలిసేలా చేసారు.

ఇప్పుడు ఇదే కాంగ్రెస్ లో నయా ట్రెండ్ సెట్టెర్ గా భట్టిని నిలిపింది. కర్ణాటక తరువాత తెలంగాణ పైన ఆశలు పెట్టుకున్న వేళ పార్టీలో జోష్ పెంచింది. వంద రోజులు ప్రతీ రోజు ప్రజల మధ్యనే ఉంటూ సాగిన భట్టిపై సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురుస్తున్నాయి. భట్టికి అనుకూల స్లోగన్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. కాంగ్రెస్ లో భట్టి పేరుతో సాగుతున్న సెలబ్రేషన్స్ బీఆర్ఎస్, బీజేపీల్లో వైబ్రేషన్స్ కు కారణమయ్యాయి. తెలంగాణ గడ్డలో ప్రతీ ప్రాంతం నుంచి భట్టికి మద్దతుగా నిలుస్తున్నారు.

భట్టి వంద రోజుల యాత్ర..బీఆర్ఎస్ పాలనకు ముగింపు యాత్రగా క్యాంపెయిన్ సాగుతోంది. భట్టి అన్నా ఇదే ఊపుతో ముందుకు దూసుకుపో.. కేసీఆర్ దుకాణం సర్దుకు పో అంటూ తెలంగాణలోని సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియాలో మద్దతు ప్రకటిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటం..రాహుల్ ప్రధాని కావటంతోనే తన యాత్ర లక్ష్యం పూర్తయినట్లు భట్టి విక్రమార్క్ తన యాత్ర వందో రోజు చేరిన సమయంలో స్పష్టం చేస్తున్నారు. భట్టికి పార్టీ అగ్రనాయకత్వం వంద రోజుల యాత్ర పూర్తయిన వేళ అభినందనలు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News