భారత్ సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా
నిర్వహిస్తున్నాం సమ్మిట్ ద్వారా
పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం
కాంగ్రెస్ మూల సిద్ధాంతాల
ఆధారంగానే సదస్సు : భట్టి
శుక్రవారం నాటి కార్యక్రమాలన్నీ
నేటికి వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇది రైజింగ్ తెలంగాణ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ భారత్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పె ట్టుబడులు ఆహ్వానించానున్నామన్నారు. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరైనట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్ర పంచానికి ఒక మోడల్‌గా చూపేందుకు భారత్ సమ్మిట్ గొప్ప కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. 100 దేశాలకు పైబడిన ప్ర భు త్వ అధినేతలు, ప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు ఇలా మొ త్తంగా 450 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ సమ్మిట్‌లో టెర్రరిజంపై డిక్లరేషన్ చేయనున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.
భారత్ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ దిశా నిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలో కోల్డ్‌వార్ జరుగుతు న్న సమయంలో ప్రపంచం మొత్తం రెండు కూటములుగా విడిపోయిన సమయంలో కొన్ని దేశాలతో కలిసి ఆనాటి ప్రధాని పండిట్ లాల్ నెహ్రూ అలీన విధానాన్ని తీసుకొని ప్రపంచానికి దిశా నిర్దేశం చూపారన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ సామాజిక అసమానతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అహింస, సత్యం, సామాజిక న్యాయం అనే మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరోసారి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ భారత్ సమ్మిట్ ద్వారా దిశా నిర్దేశం చేస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాల ఆధారంగా భారత్ సమ్మిట్ జరుగుతుందని, ఈ సమ్మిట్ లో శాంతి కాముకులు, ప్రపంచ న్యాయం కోరుకునే వారు (గ్లోబల్ జస్టిస్) ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగిన వారు 8 ప్యానెల్స్ గా చర్చల్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ మూల సిద్ధాంతాల గురించి ప్రపంచ ప్రతినిధులకు
100 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు లింగ న్యాయం, ఫెమినిస్ట్ ఫ్యూచర్, ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, కౌంటరింగ్ డిస్ ఇన్ఫర్మేషన్, యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో, షేవింగ్ న్యూ మల్టీ ల్యాటరీజం వంటి అంశాలపై లోతుగా చర్చలు చేశారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించే భారత్ సమ్మిట్ కార్యక్రమం చారిత్రాత్మకమైన సమ్మిట్‌గా నిలిచిపోతుందని డిప్యూటీ సిఎం అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమం గురించి భారత్ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధిని మేళవించి కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నామో ప్రపంచ ప్రతినిధులకు వివరించామని ఆయన వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేస్తున్న క్లస్టర్స్, ఫ్యూచర్ సిటీ, మూసీ పునర్జీవం, నాలెడ్జ్ ఐటీ సెంటర్, ఇందిరాగిరి జల వికాసం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల గురించి భారత్ సమ్మిట్ హాజరైన ప్రతినిధులకు వివరించామని ఆయన చెప్పారు.
గ్లోబల్ జస్టిస్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమం గురించి ప్రపంచ ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. దేశానికే మోడల్‌గా నిలవబోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ప్రతినిధులను కోరినట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పారు. అదేవిధంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న గ్లోబల్ జస్టిస్ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ఈ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులు స్వాగతించి, అభినందించారని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు.
హైదరాబాద్ లో సమ్మిట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణం: మంత్రి ఉత్తమ్
భారత్ సమ్మిట్ ఒక చారిత్రాత్మక ఘట్టమని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో సమ్మిట్ జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ సమ్మిట్‌తో తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా నిలిచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడి దురదృష్టకరమన్నారు. దేశంలో అస్థిరతకు కుట్రలు జరుగుతున్నాయని, భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. యావత్ భారతదేశం సంఘటితం కావలసిన తరుణం -ఆసన్నమయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రలను యావత్ భారతదేశం సంఘటితంగా తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. తాను శ్రీనగర్ సమీపంలోని అవంతి ఎయిర్ ఫీల్డ్, లడక్, సియోచిన్ గ్లెసియర్‌లో పనిచేసిన ఉదంతాలను ఆయన వివరించారు. కాశ్మీర్ గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, ఇక్కడ జరిగిన దాడి హిందూ,-ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకేనని ఆయన మండిపడ్డారు.
శుక్రవారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ వాయిదా
భారత్ సమ్మిట్ లో భాగంగా నేడు (శుక్రవారం) జరగాల్సిన పలు కార్యక్రమాలు శనివారానికి వాయిదా పడ్డాయి. కేంద్రం శుక్రవారం సంతాప దినంగా ప్రకటించడంతో ఈ కార్యక్రమాలను వాయిదా వేశారు. నేడు సిఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన హైదరాబాద్ డిక్లరేషన్ సైతం శనివారానికి వాయిదా పడింది.