Tuesday, January 7, 2025

రైతు భరోసా కోసం దరఖాస్తు అవసరం లేదు: డిప్యూటీ సిఎం భట్టి

- Advertisement -
- Advertisement -

రైతు భరోసాపై ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో రైతు భరోసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదని భట్టి తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్ ముంచినా సరిదిద్దుకుంటూ పోతున్నామని, రైతు భరోసా కింద రూ.12 వేలు ఇస్తామన్నారు.

భూమి లేని రైతు గురించి ఎప్పుడైనా కేటీఆర్ ఆలోచన చేశారా?.. భూమి లేని రైతుకి మేము రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్‌లకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వమని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News