Wednesday, January 22, 2025

వైఎస్ కుటుంబం పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనేః భట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్న భట్టి స్పందించారు. పాదయాత్రలో మీడియాతో మాట్లాడుతూ.. ”వైఎస్ కుటుంబం పుట్టింది, పెరిగింది కాంగ్రెస్‌లోనే. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తానంటే అభ్యంతరం చెప్పేవారు ఉండరు.ప్రత్యేక పరిస్థితుల్లోనే వారు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటే. కెటిఆర్ ఢిల్లీ టూర్‌తో బిజెపి, బిఆర్‌ఎస్ రహస్య బంధం బయటపడింది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News